*10 రోజుల్లో న్యాయం జరగాలి..*
*- లేదంటే కుటుంబమంతా నిరసన దీక్ష చేస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి..*
* వైకాపా ప్రభుత్వ హయాంలో బస్సుల కొనుగోలు విషయంలో తమను దొంగలంటూ జైలుకు పంపారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు..
* అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ''నా బస్సులపై తప్పుడు కేసులు నమోదు చేశారు. బీఎస్ 3 వాహనాలు అమ్మినవారు, రిజిస్ట్రేషన్ చేసినవారు ఇంటికి పోయారు. 10 రోజుల్లో నాకు న్యాయం జరగాలి..
* లేదంటే నా కుమారుడు, కోడలు ఎస్పీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తారు. నేను, నా భార్య డీటీసీ ఆఫీస్ ఎదుట నిరసన చేపడతాం. ఈ విషయం సీఎం చంద్రబాబు, ప్రభుత్వానికి సంబంధించింది కాదు. నా వ్యక్తిగత విషయం.. నాకు న్యాయం జరగాలి. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటే పార్టీకీ రాజీనామా చేస్తా'' అని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
0 Comments