Home
About
Contact
Home-icon
TG News
AP NEws
National News
Film News
Spriritual
Others
Mega Menu
About Us
Post a Comment
0 Comments
Report Abuse
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- తుడా ఛైర్మన్ గా జనసేనా పార్టీ నాయకురాలు శ్రీమతి చైతన్య పేరు దాదాపు ఖరారైంది. జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్గా, పార్టీ బలోపేతంతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపునకు విశేషంగా కృషి చేసినందుకు గానూ జనసేనా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో శ్రీమతి చైతన్య పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి తుడా ఛైర్మన్ పదవి కోసం పలువురు టీడీపీ నాయకులు పోటీలో ఉన్నారు. కానీ చిత్తూరు జిల్లాలోని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని స్వయానా శ్రీ ఆదికేశవులు నాయుడు గారి మనుమరాలైన శ్రీమతి చైతన్య వైపు జనసేన పార్టీతో పాటు కూటమి అగ్రనాయకులు మొగ్గుచూపుతున్నారు. శ్రీమతి చైతన్య గారి అభ్యర్థిత్వాన్ని జనసేనా, టీడీపీ, బీజేపీ పూర్తిగా బలపరుస్తున్న కారణంగా రెండు, మూడు రోజుల్లో శ్రీమతి చైతన్య పేరును తుడా ఛైర్మన్గా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు శాసనసభకు, చిత్తూరు పార్లమెంట్ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశాలున్నా… అధినాయకత్వం ఎంపికల్ని కాదనకుండా ఆయా చోట్ల నిలిపిన కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి నాయకులు శ్రీమతి చైతన్య అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నారు. పైగా ఈమె అదికేశవుల నాయుడు గారి కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకురాలు కావడంతో… ఈ పదవిని చైతన్యకు ఇవ్వడం ద్వారా వారి కుటుంబానికి సరైన గౌరవం కల్పించినట్లవుతుందని, ఆ ప్రాంతంలోని సామాజిక సమీకరణాల్ని సైతం తృప్తి పరిచినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
June 28, 2024
*ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది సమస్యలు* రాష్ట్ర శాసన సభలో పని చేసే హౌస్ కీపింగ్ సిబ్బందిగా ఉన్న 154 మంది మహిళలు తమ సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్లారు. గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నామని, తాము అమరావతి ప్రాంత రైతు కూలీలమని తెలిపారు. శాసనసభ రెండో రోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభకు ఉదయమే విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ ప్రాంగణమంతా కలియ తిరిగి పరిశీలించారు. అక్కడున్న సిబ్బందితో, సెక్యూరిటీతో సరదాగా మాట్లాడుతూ వారితో మమేకమయ్యారు. సిబ్బందికి ఫొటోలు ఇచ్చి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ శాసనసభను పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ హౌస్ కీపింగ్ సిబ్బంది శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తమ సమస్యలను చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా హౌస్ కీపింగ్ సిబ్బంది మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 154 మంది వరకు శాసనసభలో పనిచేస్తున్నామని, రాజధాని ప్రాంత రైతు కూలీలమని ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పారు. 8 సంవత్సరాల కిందట రూ.6 వేలకు ఉద్యోగంలో చేరామని ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నారన్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పరిధిలో ఉన్నామని తెలిపారు. అమరావతి రైతు కూలీలుగా ఉన్నందున నెలకు రూ.2500 భత్యం వచ్చేదని.. తరవాతి రోజుల్లో కీపింగ్ ఉద్యోగం ఉందని చెప్పి ఆ భత్యం నిలిపివేశారన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ.. పురపాలక ఉద్యోగులుగా గుర్తించాలని వేడుకున్నారు. హౌస్ కీపింగ్ ఉద్యోగుల సమస్యను ఆసాంతం విన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, తగు విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
June 23, 2024
https://youtube.com/watch?v=Q2EZWtNx61g&si=rPQJ9DbKVHlhrVPT
June 23, 2024
Subscribe Us
Most Popular
Labels
APNews
2
FilmNews
1
https://youtu.be/b_xXBfS_Yjg?si=_e1sheR03RYhCA9Q
1
NationalNews
1
Others
1
Spiritual
1
TGNews
1
Contact form
0 Comments