ప్రకాశం :-
విద్యుత్ షాక్ తో లైన్ మెన్ కు తీవ్ర గాయాలు
రాచర్ల మండలంలోని అనుమల వీడు సచివాలయ పరిధిలో విద్యుత్తు లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న సురేష్ నాయక్ కు విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం ఉదయం జరిగింది నాయక్ పాలక వీడు చెరువు కట్ట సమీపంలో విద్యుత్ స్తంభం పై విద్యుత్ మరమ్మత్తు పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు సరఫరా కావడం షాక్ తో నాయక్ స్తంభం పైనుండి కిందపడిపోయాడు కాలు చేతికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు విద్యుత్ అధికారులతో పాటు 108 కి సమాచారం అందించడంతో వారు వచ్చి ప్రథమ చికిత్స నిర్వహించి వెంటనే గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలిస్తున్నట్లు సమాచారం
0 Comments