*గూడూరు విలేఖరుల పై బహిష్కృత నకిలీ విలేఖరుల ముఠా కుట్రలు*
*🛑గూడూరు విలేఖరుల పై బహిష్కృత నకిలీ విలేఖరుల ముఠా కుట్రలు*
*🛑నకిలీ సంతకాలతో పోలీస్ అధికారులను తప్పుదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి*
*🛑 గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్*
*🛑 విలేఖరుల పేరుతో 50లక్షలు దండుకున్న నకిలీ విలేఖరుల దండాకాల ఫిర్యాదులో చర్యలు శూన్యం*
*🛑 అధికారులు, విలేకరులను వేదిస్తూ చెలరేగుతున్న నకిలీ విలేఖరుల ముఠా*
*🛑వాస్తవాలు విచారించి న్యాయం చేస్తాం.. సంయమనం పాటించండి*
*🛑 గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి*
*✍️: గూడూరు కేంద్రంగా గతం లో జర్నలిస్ట్ కాలనీ, విలేఖరుల పేరు చెప్పి 50 లక్షలు రూపాయలు వసూళ్లకు పాల్పడిన "నకిలీ విలేఖరుల ముఠా" జర్నలిస్ట్ లుగా దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారే లక్ష్యం గా చెలరేగిపోతూనే ఉంది. ఇదే క్రమంలో కొందరు వ్యక్తుల పేరుతో,నకిలీ సంతకాలతో సామాజిక మాధ్యమాలు ద్వారా జిల్లా పోలీస్ అధికారులను తప్పుదారి పట్టించేలా తేదీ 15-06-2024 వతేదీన తప్పుడు ఫిర్యాదులను చేశారు.వాస్తవాలు విచారించే సమయం లేకుండా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వివరణ తీసుకునే సమయం లేక కేసు నమోదు చేసినట్లు గూడూరు రూరల్ పోలీసు వారు చెబుతున్నారు.*
*గతంలో జర్నలిస్ట్ లో పేరుతో దండిన 50లక్షల రూపాయలు దుర్వినియోగం పై చర్యలు తీసుకోవాలని గూడూరు జర్నలిస్ట్ లు జిల్లా స్థాయి నుంచి,గూడూరు పోలీస్ అధికారుల వరకూ చేసిన ఫిర్యాదు ల పై ఇప్పటి వరకూ చర్యలు లేవు.జర్నలిస్ట్ లు సొమ్ము తిని,జర్నలిస్ట్ లు గా చెలామణి అవుతూ జర్నలిస్ట్ ల స్థలాలు కబ్జా చేసే ప్రయత్నాలు చేసిన "నకిలీ విలేకరుల ముఠా"ను గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు బహిష్కరణ చేశారు. వారు అప్పటి నుంచి కక్ష పూరితంగా గూడూరులో జర్నలిస్ట్ లకు జరుగుతున్న అన్యాయం పై ప్రశ్నిస్తున్న వారినే లక్ష్యం గా "ఈరోజు వాట్సాప్ లో విలేకరులపై కేసు అంటూ వాట్సాప్ సోషల్ మీడియా గ్రూప్ లలో వైరల్ చేసిన నకిలీ విలేఖరుల ముఠా తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.*
*వీరి నిత్యకృత్యం అధికారులను,నాయకుల ను చట్టాలను దుర్వినియోగం చేస్తామని బెదిరించడం వసూళ్లు చేసుకోవడం.వీరి గుట్టు ఈమధ్య కాలంలో రట్టు కావడం తో రిజిష్టర్ సంఘంగా సీనియర్ జర్నలిస్ట్ ల నాయకత్వంలో పనిచేస్తున్న గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం ముఖ్య నాయకులపై నకిలీ సిమ్ లు, ట్రాపింగ్ వాట్సాప్ రికార్దింగ్ లతో పోలీస్ అధికారులకు తప్పుడు ఫిర్యాదుతో తప్పుదారి పట్టించారు. గూడూరు బహిష్కృత నకిలీవిలేఖరుల బృందం వారి పథకం ప్రకారం గూడూరు జర్నలిస్ట్ నాయకుల ప్రతిష్ట దిగజార్చే విధంగా లిటికేషన్ తో ఓ అవాస్త విషయానికి ఎట్టకేలకు కేసు రూపం ఇచ్చారు.*
*తప్పుడు కేసు విషయం ను గూడూరు జర్నలిస్ట్ లు నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన తక్షణమే స్పందించి పోలీస్ అధికారులతో చర్చించారు. వారు ఫిర్యాదు విషయమై గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి స్పందిస్తూ సమగ్రంగా విచారణ చేపడతామనన్నారు.*
*ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరుఫున గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు రూరల్ ఎస్ ఐ కలసిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ ల నాయకులు తమ దృష్టికి తెచ్చిన వివరాలను కూడా పరిగణలోకి తీసుకుని విచారిస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ను దుర్వినియోగం చేస్తూ సమాజంలోని వ్యక్తులను, పోలీసులను అప్రతిష్ట పాలు చేసేలా కుట్రలు చేస్తే సహించబోమన్నారు.*
0 Comments