గూడూరు లో బాలయ్య బాబు జన్మదిన వేడుకలు.
కేకు కట్ చేసి, బాణా సంచాకాల్చి సంబరాలుచేసిన బాలయ్య అభిమానులు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణం లో నందమూరి నటరత్నం, నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించడం జరిగింది. గూడూరు సాధుపేట సెంటర్ లో టీడీపీ పార్టీ జెండా స్తంభం వద్ద అభిమానులు బాలయ్య బాబు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, కేకు కటింగ్ చేశారు. జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. కాబోయే మంత్రి అంటూ జయ జయ ద్వానాలు చేశారు. బాణాసంచాకాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం చాకోలెట్స్, కేకు పంచిపెట్టారు. నాయకులు మాట్లాడుతూ, మా నందమూరి బాలయ్య బాబు, తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, తండ్రి తెలివితేటలూ, రాజకీయ చతురత పుణికిపుచ్చుకొని ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి బాలయ్య బాబు అన్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి వర్గం లో మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోయే మా బాలయ్య బాబు నిండునూరేళ్ళు సిరిసంపదలు ఆయురారోగ్యాలతో మరెన్నో పదవులు అలంకరించి కలకాలం జీవించాలని కోరుకుంటున్నాము అన్నారు. ఈ పుట్టినరోజు వేడుకలలో నరసింహులు నాయుడు, ధనుంజయ, రమేష్ నాయుడు, మోహన్ రెడ్డి, నడిపయ్య నాయుడు, మల్లిఖార్జున రెడ్డి, ప్రసాద్ నాయుడు, చంటి, కుమార్, రామయ్య, రాజా, అంకయ్య, భాస్కర్, బాలకృష్ణ అభిమానులు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.
0 Comments