*త్యాగం,సహనం, దాన గుణం ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్...*
*రాయచోటి పట్టణంలోని ఈద్గా లో ముస్లిం మైనార్టీ సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనలో తమ్ముడు లక్ష్మీప్రసాద్ రెడ్డి తో కలసి ప్రార్థనల నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి... రవాణా,క్రీడా,యువజన శాఖ మంత్రి...*
మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ,భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు అందరు బక్రీద్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు. బక్రీద్ సందర్భంగా రాయచోటి పట్టణంలోని ఈద్గాలో ముస్లిం మైనార్టీ సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనలో తమ్ముడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి తో కలిసి ప్రార్థనలు నిర్వహించారు .త్యాగనిరతి, దానగుణం,సహనం ఐకమత్యానికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్ అని, తమకు కలిగిన దాంట్లో ఇతరులకు కొంత పంచిపెట్టడమనే దాతృత్వాన్ని బక్రీద్ ద్వారా నేర్చుకోవచ్చని మంత్రి అన్నారు. అల్లా ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఆయన దీవెనలతో రాష్ట్రంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
0 Comments