జగన్‌కు గౌరవం ఇవ్వండి: చంద్రబాబు
ప్రతిపక్షనేత హోదా దక్కకపోవడంతో మాజీ సీఎం జగన్ గేటు బయటే కారు దిగి అసెంబ్లీ లోపలికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలకు అనుమతించాలని ఆదేశించారు. అటు టీడీపీ సభ్యులకు సీఎం కీలక సూచనలిచ్చారు. చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయవద్దని, రాగద్వేషాలకు తావు ఇవ్వొద్దన్నారు. విపక్ష సభ్యుల విషయంలో హుందాగా వ్యవహరించాలన్నారు.
0 Comments