రామోజీరావు మృతికి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన నేతలుఅస్తమించిన అక్షర సూరీడికు ఘన నివాళి*

*రామోజీరావు మృతికి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన నేతలు*

*అస్తమించిన అక్షర సూరీడికు ఘన నివాళి*
*పట్టుదలకు అంకితభావానికి రామోజీ ఆదర్శం*
*వేలాదిమందికి ఉపాధి కల్పించిన కల్పవృక్షం*
*తెలుగుభాష అభ్యున్నతికి ఎంతోగానో కృషిచేసిన మహనీయుడు*

అలుపెరగని కృషి, పట్టుదల, అంకితభావం, ధృడదీక్షకు రామోజీరావు పెట్టింది పేరు. వేలాదిమందికి ఉపాధి కల్పించిన కల్పవృక్షం ఆయన. తెలుగుభాష అభ్యున్నతికి ఎంతోగానో కృషిచేసిన మహనీయుడు రామోజీరావు. ఆయన మృతి యావత్ తెలుగు ప్రజలు, పత్రికా రంగానికే తీరని లోటని టీడీపీ నేతలు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో రామోజీ చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు.

రామోజీరావు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు, బోండా ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యులు పర్చూరి  అశోక్ బాబు, దువ్వారపు రామారావు, శాసనసభ్యులు కొండ్రు మురళి, దాట్ల సుబ్బరాజు, ఎమ్మెస్ రాజు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మరియు పార్టీ నాయకులు లింగారెడ్డి, ఏవి రమణ, దారనాయక్, ఆనంద్ సూర్యా, అఖిల్, హసన్ భాష, కృష్ణ, బుచ్చి రాంప్రసాద్, వద్దులూరి వెంకటేశ్వరరావు, శంకర్ నాయుడు మరియు పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు ఘన నివాళులు అర్పించారు.

*టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..*
చెరుకూరి రామోజీరావు మృతి నాకు వ్యక్తిగతంగా చాలా కలచివేసింది. రామోజీరావుగారి మరణం యావత్ తెలుగుజాతీకి, దేశానికి తీరని నష్టం జరిగింది. ఒక సమాన్యమైన కుటుంబలో పుట్టి ఒక అసామాన్యమైన వ్యక్తిగా ఎదిగనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావుకే చెందుతుంది. నిబద్దతతో అంకితభావంతో నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన సుదీర్ఘకాలంలో ఎన్నో ఆటు పోట్లు, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. కాని నమ్మిన సిద్దాంతాలను వదలకుండా చివరి శ్వాస వరకు సమాజం గురించి పనిచేసిన వ్యక్తి రామోజీరావు, వ్యాపార రంగంలోగాని, పత్రికా రంగంలోగాని, సినీ రంగంలోగాని.. ఏ రంగాన్ని ఎంచుకన్నా ఆ రంగానికే వన్నె తెచ్చిన వ్యక్తి రామోజీరావుగారు. వ్యాపరంతో, పత్రికా ఏర్పాటుతో లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మహోన్నత వ్యక్తి. ఎవరికి తెలియని రోజుల్లో పేపరు పెట్టడమే కాకుండా ఆ పేపరును తెల్లారి ఐదు గంటలకే మారుమూల గ్రామాలకు పంపి ఈదేశంలో జరుగుతున్న పత్రి విషయాన్ని తెలియజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు. ఎన్నో టీవీలు,  ఛానల్స్ వచ్చినా ఈటీవి వచ్చాక టీవీల ప్రాముఖ్యత తెలిపి ఆదర్శంగా తీర్చి దిద్దాడు. రామోజీరావు సుదీర్ఘకాలంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు పెట్టారు.  ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిజాలను రాసి మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గౌరవ ప్రధమైన రాష్ట్రంగా తీసుకు రావడానికి రామోజీరావు కృషి చేశారు. రాష్ట్ర శాఖ ఆదేశాలు ఇచ్చాం. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో రామోజీరావు పటాలు పెట్టి నివాళి అర్పించాలని నిర్ణయించాం. రామోజీరావు చూశాక ప్రతి ఒక్కరిలో ఒక పట్టుదల, ఆదర్శం గుర్తు వచ్చేలా కార్యక్రమాలు చేపేడతాం. 

*టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ...*

1936 కృష్ణా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న చెరుకూరి రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు. పత్రికారంగంలోగాని సినీరంగంలో గాని ఆయపేరు సువర్ణాక్షరాలతో లికించవచ్చు. మొట్టమొదటినుండి  కూడా ఆధునిక భవాలతో ప్రపంచీకరణకు కృషి చేసిన మహానుభావుడు. ఈనాడు పత్రిక పత్రికారంగంలోనే ఒక తలమానికం.  ఈనాడు మీడియా సంస్థ ద్వారా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసి సమాజాన్ని చైతన్యం చేశారు. ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు చేరువగా సమాచార హక్కు చట్టం, సుజలాం, సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం ఊరూవాడా చైతన్యం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. తెలుగుజాతికి ఆయన సేవలు మరువలేనివి.

*టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ..*

తెలుగు జాతికి గర్వకారణమైన వ్యక్తి రామోజీరావు. ఎంతో చిన్న కుటుంబంలో పుట్టినా తన రెక్కల కష్టంతో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి రామోజీరావు. విలువలకు పట్టంకట్టి విలువలకు ప్రాధన్యతను ఇచ్చే ఈటీవీ, ఈనాడు పత్రికలను ఏర్పాటు చేసి తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాపించిన వ్యక్తి నేడు లేకపోవడం తెలుగు జాతికి పూడ్చలేని లోటు. మానాయకుడు చంద్రబాబు ఢిల్లీనుండి హాటాహుటినా వచ్చి రామోజీ మృతికి ఘన సంతాపం తెలిపారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నేడు కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి అర్పిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.

Post a Comment

0 Comments