*పింఛన్లు పంపిణీ చేస్తూ మధ్యలో ఇంటికి, కాసేపటికే బాత్రూంలో శవమై కనిపించిన సచివాలయ ఉద్యోగిని..!!*
నంద్యాల జిల్లా :
నూనెపల్లెకు చెందిన సుధారాణి (32) నంద్యాల తలారి పేటలో 29వ వార్డు సచివాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తుంది..
సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పింఛన్లు పంపిణీ చేసిన ఆమె.. అనంతరం మధ్యలో ఇంటికి వెళ్లింది..
అయితే ఎంతకు ఆమె బయటకు రాకపోవడంతో తోటి ఉద్యోగులు ఫోన్ చేశారు..
అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు..
ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సుధారాణి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె తన పుట్టింట్లో ఉన్నట్లు తెలిసింది..
వెంటనే అక్కడకు వెళ్లి చూడగా,ఇంట్లోని స్నానాల గదిలో అనుమానాస్పద స్థితిలో సుధారాణి మృత దేహం కనిపించింది..
పోలీసులు ఆమె మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు..
మృతురాలి భర్త, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నంద్యాల మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు..
సుధారాణికి ఏడాది క్రితమే వివాహం జరిగినట్లు తెలుస్తోంది..
మృతురాలి భర్త కూడా సచివాలయ ఉద్యోగే కావడం గమనార్హం..
ఘటనపై పూర్తి విచారణ అనంతరం అసలు కారణం తెలుస్తుందని పోలీసులు మీడియాకు తెలిపారు..
0 Comments