పగిడ్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మైనర్‌ బాలిక అదృశ్యం కేసులో ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా తెలిపారు. ఈనెల 7న అదృశ్యమైన బాలికను ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు మాయమాటలు చెప్పి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సమీపాన ఉన్న ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అనంతరం గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపినట్లు నిందితులు అంగీకరించారు. అక్కడి నుంచి శవాన్ని తీసుకొచ్చి కేసీ కెనాల్‌ వద్ద దాచారు.ఈ విషయాన్ని బాలురు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అదే రోజు రాత్రి శవాన్ని అక్కడి నుంచి వనములపాడు మీదుగా కృష్ణానదిలో పుట్టిలో తీసుకెళ్లి తాడుతో రాయికి కట్టి నీటిలో పడేశారు. ఇదే విషయాన్ని బాలుడి తండ్రి, పెదనాన్న చెప్పడంతో ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. బాలిక మృతదేహం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. గజ ఈత గాళ్లు, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు, 6 స్పెషల్ పార్టీ బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, టెక్నికల్ టీమ్‌లను రంగంలోకి దింపి గాలింపు చేపట్టామని వివరించారు.

పగిడ్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మైనర్‌ బాలిక అదృశ్యం కేసులో ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా తెలిపారు. ఈనెల 7న అదృశ్యమైన బాలికను ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు మాయమాటలు చెప్పి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సమీపాన ఉన్న ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అనంతరం గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపినట్లు నిందితులు అంగీకరించారు. అక్కడి నుంచి శవాన్ని తీసుకొచ్చి కేసీ కెనాల్‌ వద్ద దాచారు.
ఈ విషయాన్ని బాలురు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అదే రోజు రాత్రి శవాన్ని అక్కడి నుంచి వనములపాడు మీదుగా కృష్ణానదిలో పుట్టిలో తీసుకెళ్లి తాడుతో రాయికి కట్టి నీటిలో పడేశారు. ఇదే విషయాన్ని బాలుడి తండ్రి, పెదనాన్న చెప్పడంతో ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. బాలిక మృతదేహం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. గజ ఈత గాళ్లు, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు, 6 స్పెషల్ పార్టీ బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, టెక్నికల్ టీమ్‌లను రంగంలోకి దింపి గాలింపు చేపట్టామని వివరించారు.

Post a Comment

0 Comments