ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్.



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు గారిని  మర్యాదపూర్వకంగా కలిసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్*

*విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ లో విజయవాడ డివిజన్  పనితీరు మరియు భద్రత పై  సమీక్ష నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్*

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు అనగా జూలై 1, 2024న అమరావతిలోని వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ముఖ్యమంత్రి గారితో  దక్షిణ మధ్య రైల్వే జోన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు మరియు ప్రాజెక్టుల గురించి  అరుణ్ కుమార్ జైన్ వివరించారు .  జనరల్ మేనేజర్తో పాటు  గుంటూరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ మరియు విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్  నరేంద్ర ఎ. పాటిల్ ఉన్నారు.  
సత్యనారాయణపురంలోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఇ. టి. టి. సి )లో ఈ రోజు ఉదయం నిర్వహించిన  సేఫ్టీ సెమినార్‌లో పాల్గొన్న జనరల్ మేనేజర్  అరుణ్ కుమార్ జైన్,  లోకో పైలట్ ట్రైనీలతో రైల్వే కార్యకలాపాలలో భద్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. లోకో పైలట్లు మరియు ఫ్రంట్‌లైన్ సిబ్బంది ఉద్యోగ నిర్వహణలో వారి  పాత్ర చాలా ముఖ్యమైనదని అరుణ్ కుమార్ జైన్ నొక్కిచెప్పారు మరియు  విధి నిర్వహణలో ఖచ్చితంగా పాటించవలసిన నియమ  నిబంధనల యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేశారు.  ప్రమాదాలను ముందస్తుగా నిరోధించడానికి మరియు రైలు కార్యకలాపాలు సాఫీగా సాగేలా చేయడానికి నిబంధనల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలని వారికి చెప్పారు . భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, తమ విశ్రాంతి కాలాన్ని ఎల్లప్పుడూ విశ్రాంతి కోసం మాత్రమే వినియోగించుకోవాలని , ప్రశాంతమైన మనస్సుతో విధులకు రావాలని ఆయన వారికి  ఉద్బోధించారు.  ఈ భద్రతా సెమినార్‌కు దక్షిణ మధ్య రైల్వే  జోన్ నుండి సుమారు 400 మంది లోకో పైలట్ ట్రైనీలు హాజరయ్యారు.
 తదుపరి  విజయవాడలోని డివిజనల్ సమావేశ మందిరంలో డివిజన్  పనితీరు పై  జరిగిన సమీక్షా సమావేశానికి దక్షిణ మధ్య రైల్వే  జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అధ్యక్షత వహించారు. విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే శ్రీ నరేంద్ర ఎ. పాటిల్ జనరల్ మేనేజర్ గారికి డివిజన్‌లో పురోగతిలో ఉన్న అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి వివరించారు.  పెండింగ్‌లో ఉన్న విజయవాడ - గూడూరు ట్రిప్లింగ్ పనులను వేగవంతం చేయడం, నార్త్ సెక్షన్‌లో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ మరియు సెక్షనల్ సామర్థ్యాన్ని పెంచడానికి విద్యుద్దీకరణ పనులు వేగవంతం చేయడం, రద్దీగా ఉండే హౌరా-చెన్నై కారిడార్‌లో రైలు కార్యకలాపాలను  సాఫీగా నిర్వహించడానికి మరియు సెక్షన్ పై ఒత్తిడి ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల పై ఉద్ఘాటించారు.
దక్షిణ మధ్య రైల్వే  జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ రైలు కార్యకలాపాలలో సమయపాలన, భద్రత మరియు లోడింగ్ పనితీరును మెరుగుపరచడంపై  తీసుకోవాల్సిన చర్యల పై నొక్కిచెప్పారు.  రైళ్ల రాకపోకలు సజావుగా సాగేలా  పురోగతిలో ఉన్న పనులను ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికను అమలు చేయాలని అధికారులకు సూచించారు.
జనరల్ మేనేజర్ మెరుగైన ఆపరేటింగ్ నిష్పత్తిని సాధించడానికి ఆదాయాలను పెంచడానికి మరియు వ్యయాన్ని తగ్గించడానికి అన్ని స్థాయిలలో రికార్డుల డిజిటలైజేషన్‌ను చేసేందుకు అనువైన మార్గాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  ఉత్తమ పనితీరు కనబరిచిన  డివిజనల్ అధికారులు మరియు సిబ్బందిని కూడా ఆయన అభినందించారు మరియు ప్రయాణీకుల భద్రతకై  ఉన్నత భద్రతా ప్రమాణాలను పాటించాలని వారికి సూచించారు.

Post a Comment

0 Comments