నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చుమర్రి గ్రామంలో మైనర్ బాలిక పై అత్యాచారం మరియు హత్య కేసు విచారణలో భాగంగా రాబడిన సమాచారం మేరకు ముద్దాయి అయిన హుస్సేన్ ను నంద్యాల టౌన్ శివారులో మసీదుపురం మెట్ట వద్ద అదుపులోకి తీసుకొనీ నందికొట్కూరు కి తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యలో మిడ్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తలముడిపి బాట వద్ద ముద్దాయి హుస్సేన్ పోలీస్ జీప్ లో నుండి దూకి పారిపోతుండగా, అతనిని పోలీసులు పట్టుకొనగా, ఆయాసం తో ఎద నొప్పిగా ఉందని చెప్పగా, వెంటనే పోలీసులు ముద్దాయి హుస్సేన్ ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి మార్గమధ్యమంలో లో చనిపోయాడని నిర్ధారించడం జరిగింది.
పై విషయానికి సంబంధించి మిడుతూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.
కర్నూలు జిల్లాకు చెందిన డి.ఎస్.పి స్థాయి అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది.
ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు శవపంచనామా నిర్వహించడం జరిగింది.
చనిపోయిన వ్యక్తి గత కొంతకాలం నుండి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు శవ పంచనామా సమయంలో బందువులు మేజిస్ట్రేట్ ముందు చెప్పడం జరిగింది.
కేసు నిష్పక్షపాత దర్యాప్తులో భాగంగా,
డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం పూర్తి చేయించడం జరిగింది.
మొత్తం పోస్టుమార్టం ప్రాసెస్ ను వీడియోగ్రఫీ చేయడం జరిగింది.
చట్ట ప్రకారం అన్ని నియమ నిబంధనలు పాటించి కేసు ను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నాము.
జిల్లా పోలీసు కార్యాలయం,
0 Comments