¢. 42. బ్యాక్టీరియా విశేషాలు.
బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు మన జీవితాలని ఎన్ని రకాలుగా ప్రభావితం చేయగలవో పూర్తిగా అర్థం కావటం లేదు. పరిశోధనల్లో బయటపడుతున్న కొత్త విషయాల్లో, వాటి గురించిన, మంచి, చెడూ కూడా తెలియ వస్తుంది. ఒక్కటి మాత్రం నిజం, ప్రపంచంలో ప్రతిచోటా నిలదొక్కుకుని జీవిస్తున్న, రకరకాల బ్యాక్టీరియాను తప్పించుకోవడం అసాధ్యమైన పని. పనికిరాని చెత్తనూ కుళ్ళిన జీవ పదార్థాలను ఎప్పటికప్పుడు విడగొట్టి, మట్టిలో కలిపేసే బ్యాక్టీరియా, మనకు పనికొచ్చే ఆహారాన్ని కూడాపాడు చేస్తూ ఉంటాయి. మానవులు సమాజ జీవితం మొదలుపెట్టిన నాటి నుంచి, ఆహారాన్ని చెడిపోకుండా నిలువ ఉంచుకోవడానికి, నానా అగచాట్లూ పడుతూనే ఉన్నారు. ఎండబెట్టిన పదార్థాలు నిలువ ఉంటాయని వారు గ్రహించారు. బ్యాక్టీరియా పెరగటానికి తేమ అవసరం కనుక వాటిని అరికట్టేందుకు ఇదొక పద్ధతి. అలాగే చలి ప్రదేశాల్లో ఆదిమానవులు ఆహారాన్ని మంచు పేరుకున్న గుహల్లో దాచుకునేవారు. ఈ రోజుల్లో ఆధునిక పద్ధతులు ఎన్నో అమలులో ఉన్నాయి. ఫ్రిడ్జ్ చేసి చల్లబారిన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం. వేడి గాలిలో ఎండబెట్టడం, గామా కిరణాలకు గురిచేసి బ్యాక్టీరియాను నాశనం చేయడం మొదలైన వన్నీ, కనబడని సూక్ష్మ జీవుల తో మనం సాగించే పోరాటంలో భాగాలే.
పరిశోధకులు బ్యాక్టీరియాను ఏ రకానికి కారకంగా విడదీసి ప్రయోగాలు చేస్తారు. కానీ ప్రకృతిలో మాత్రం అనేక రకాలు కలిసి తుట్టెలాగా జీవిస్తూ ఉంటాయి. మన శరీరాల లోపలి భాగాల్లో పలుచని పొరలాగా వ్యాపించినట్టే ఇవి సామాన్యంగా నీళ్ళలో ఉన్నప్పుడు నీటికి, గాలికి మధ్య ఉపరితలం మీద తేలుతూ ఉంటాయి. పెద్ద సిటీల్లో ఎందరో ప్రజలు కలిసికట్టుగా ఉన్నట్టుగా, ఇవన్నీ తమ తమ ప్రత్యేక విధులు నిర్వహిస్తూ కలిసిమెలసి జీవిస్తాయి. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, అలాంటి పరిస్థితుల్లోనే పరిశీలించాలని శాస్త్రవేత్తలకు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం బ్యాక్టీరియా జాతుల్లో తెలియనివి 95 శాతం మిగిలే ఉన్నాయి. తెలిసినవాటి genome పటాన్ని వారు తయారు చేస్తున్నారు. జెనటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల్లో వాటిని మనకు ఉపయోగపడేట్టు గా మార్చుకోవడం కూడా మొదలైంది. అమెరికాలో బంగారు గనుల్లో వాడే రసాయనాల్లో, సైనైడ్, పాదరసం,ఆర్సినిక్ మొదలైన విషాలు కాలుష్యానికి కారణం అవుతున్నాయని గమనించారు. 30 ఏళ్ళ తరువాత సైనైడ్ నా సహించడమే కాక, దాన్ని ఆరగించే బ్యాక్టీరియాను కృత్రిమంగా గుర్తించారు. అందువల్ల ఒకప్పుడు విష ప్రాయం అనిపించిన సెలయేళ్ల లో ఈనాడు చేపలు పట్టడం వీలవుతుంది.
బ్యాక్టీరియా గురించి కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. అంతకు మునుపు ఎన్నడూ ఊహించని విధంగా, అవి ఎన్నో రోగాలకు కారణమని ఆధునిక ప్రయోగాల్లో రుజువవుతుంది. వీటిలో గుండె జబ్బులు, కేన్సర్ వంటివి కూడా ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఈ జాబితాలో పాత రోగాలు కొన్ని బ్యాక్టీరియా ముద్దాయి స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
పని తోనూ, సమన్వయంతో నూ ఒత్తిడికి లోనయ్యే వారిలో కొందరికి, కడుపులో ఏ సి డి టి పెరగడం, అది ఎక్కువైతే అల్సర్లకు దారితీయడం మామూలే. జీర్ణకోశంలో ఉండే హైడ్రో క్లోరిక్ ఆమ్లం, పెప్సిన్ వంటి ఇతర ఎంజైములూ అంటే కడుపు లోపలపొరను నాశనం చేయడంతో పుండు ఏర్పడుతుంది. ఇటువంటి వ్రణం జీర్ణకోశంలో నో, చిన్నప్రేగుకు ముందు భాగంలో ఉండే ఆంత్రమూలం(డ్యూ ఓడినమ్)లోనో ఏర్పడి పైపొరను ఛిద్రం చేస్తుంది. అందువల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, వాంతులు, కడుపులో మంట మొదలైనవి కలిగి, మరీ తీవ్ర పరిస్థితుల్లో రక్తస్రావం, మరణం కూడా సంభవిస్తాయి. దీనికి వంశపారంపర్య లక్షణాలు, ఆహారపు అలవాట్లు, మానసిక ఆందోళన కారణం అనుకునేవారు. ఆమ్లానికి విరుగుడుగా క్షారపదార్థాలను ఉపశమనంగా వాడి, మరీ ముదిరిన రోగానికి శస్త్ర చికిత్స చేయడం పరిపాటి. ఆస్ట్రేలియాలో దీన్ని గురించి 1982 ప్రాంతాల నుంచి పరిశోధనలు చేస్తున్న బాబి మార్షల్ అనే శాస్త్రవేత్త, మాత్రం రోగుల జీర్ణ కోశ భాగాల్లో ఒక కొత్తరకం బ్యాక్టీరియా ఉన్నట్టు కనిపెట్టారు. ఈ విషయాన్ని ఇతరులు అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే జీర్ణకోశం లోని ఆమ్ల ద్రవాల్లో బ్యాక్టీరియా బతికి ఉండే అవకాశమే లేదని ఏనాడో నిర్ధారణ అయింది. మార్షల్ మాత్రం తన పరిశోధనల ఫలితాలను గట్టిగా నమ్మి, సదరు బ్యాక్టీరియా కలిసిన ద్రావకాన్ని తానే స్వయంగా తాగి, అల్సర్ తెచ్చుకుని, ఆ తర్వాత నయం చేసుకున్నాడు. ఈ సంఘటన వల్ల అతని ప్రతిపాదనకు ఆమోదం లభించడమే కాక, అతనికి 2005లో నోబెల్ బహుమతి కూడా లభించింది.
ఇంతకీ బ్యాక్టీరియా కడుపులోకి ఎలా చేరాయి? ప్రయోగాల వల్ల తెలిసేదేమిటంటే, బ్యాక్టీరియా జీర్ణాశయంలోని మ్యూకస్ పొర అడుగున దూరి దాక్కుంటాయి. అందువల్ల అవి ఆమ్లాల ప్రభావం నుంచి తప్పించుకోగలిగారు తాయి. ఈ లోపల వాటి ఉనికిని పసిగట్టిన రోగనిరోధక వ్యవస్థ, వాటిని నిర్మూలించటానికి 'టి' కణాలను పంపుతుంది. ఈ కణాలు మ్యూకస్ పొర అడ్డుగా ఉండటంతో బ్యాక్టీరియాను సమీపించ లేక యివతలే ఉండిపోతాయి. కొంతకాలం గడిచాక ఆ కణాలు చచ్చిపోయి, బ్యాక్టీరియాను నాశనం చేయగలిగిన వాటి రసాయనాలన్నీ మ్యూకస్ పొర మీద చిందటంతో దానికి హాని కలుగుతుంది. ఈలోపల క్రిమిసంహారక కణాల పోషణకై శరీరం సరఫరా చేసినా ఆహారాన్ని బ్యాక్టీరియా ఆరగిస్తూ ఉంటాయి.
మిగతా విషయాలకొస్తే శరీరంలో పంటి చిగుళ్ళు వాపు నుంచి, మూత్రకోశ వ్యాధులు దాకా శరీరంలోని ఏ భాగంలో క్రిములు మనల్ని ఇబ్బంది పెట్టినా అది గుండెజబ్బులకు రంగం సిద్ధం చేయగలదని అంచనా. ఎలాగంటే క్రిములు రక్త ప్రవాహంలో చొరబడితే అవి రక్తం గడ్డకట్టే పరిస్థితులు కలిగించగలవు. ఒక్కొక్కప్పుడు అవే ఎక్కువ మోతాదులో ధమనుల్లో పేరుకుపోయి, తూము లోకి చేరినమురికిలాగా రక్తప్రసరణానికి అవరోధం కలిగిస్తాయి. క్రిముల సంఖ్య పెరిగినట్లయితే రోగనిరోధకశర్యకు,పాల్పడే తెల్ల రక్త కణాలన్నీ రక్తనాళాల్లోకి చేరి, అక్కడ ఉన్న కొలెస్ట్రాల్ కణాలకు తగులుకుంటాయి. అందువల్ల కూడా ధమనులు పూడుకు పోవచ్చు. ఇవన్నీ కొత్త విషయాలు. ఇంతకు ముందు గుండెజబ్బులకు బ్యాక్టీరియా కారణం అని ఎవరైనా అంటే ,నవ్వి పోతారనే భయం ఉండేది. ఇప్పుడు ఈ దృక్పథం మారుతుంది.
మరొకవంక భూగోళపు మహాసముద్రాలలో, ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉన్నాయో ఆక్సిజన్ తయారీ తోపాటు అవి ఇంకా ఏ ఏ ప్రక్రియలకు కారణమవుతున్నాయో ఇప్పటికీ సరిగ్గా తెలియదు. బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవుల జనాభా లెక్కలు కట్టే ఈ పరిశోధనలకు గాను, ఇటీవల వంద కోట్ల అమెరికన్ డాలర్లు ఖర్చు తో పదేళ్ల పాటు కొనసాగే ఈ ప్రయోగాలను 70 దేశాల్లో చేపట్టారు. పర్యావరణంఊ జరిగే మార్పుల విషయంలో వీటి పాత్ర ఎంత ఉందో తెలుసుకోవాల చిన అవసరం ఉంది. వాతావరణంలో జరిగే మార్పుల మీద, ఆక్సిజన్, కార్బన్ వంటి పదార్థాల మోతాదు మీద, బ్యాక్టీరియా ప్రభావం బలంగా పని చేస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే వాటి వల్ల ఏటా సుమారు 15 వేల కోట్ల కిలోగ్రాముల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కొన్నిరకాల సూక్ష్మజీవులు మెథేన్ వాయువును ఫీల్చేసి, గ్రీన్ హౌస్ ప్రభావాన్ని తగ్గించటం ద్వారా, భూగోళం వేడెక్కకుం డా కాపాడగల దని అంచనా. మొత్తం మీద బ్యాక్టీరియా వల్ల ఎక్కువ లాభాలూ, కొన్ని నష్టాలూ మనకు తప్పవు. వాటి గురించి ఎంత బాగా తెలుసుకోగలిగితే మనకు అంత మంచిది.
_________ముగిసింది_____________
0 Comments