నన్ను ఓడించేందుకు ప్రత్యేకంగా టార్గెట్ చేసినమాజీ మంత్రి పెద్దిరెడ్డి.

ప్రత్యేకంగా నన్ను ఓడించేందుకు టార్గెట్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి ...ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. 

తిరుపతి జిల్లా... సత్యవేడు 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక పర్యాయాలు నన్ను టార్గెట్ చేసి ఎన్నికల్లో ఓడించేందుకు ఇండిపెండెంట్ ల ప్రోత్సహించడం ఎన్నికల్లో  ఓడించేందుకు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారంట ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీడియా సమావేశంలో అన్నారు. 

గత ఎన్నికల సమయంలో మద్యం డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేసి వేరే జిల్లాల నుండి చెందిన వ్యక్తి అమాయకుడిని తీసుకొచ్చి పెద్దిరెడ్డి ఆడించే ఈలుబొమ్మలాంటి వ్యక్తి నిలబెట్టి సత్యవేడు నియోజకవర్గంలో ఆయన నిలబెట్టిన వ్యక్తి గెలుపొందుతాడని మాజీ సీఎం దగ్గర మెప్పు పొందేందుకు వేసిన ఎత్తుగడలును సత్యవేడు ప్రజలు  ఆదిమూలంపై నమ్మకం పెట్టి నన్ను గెలిపించారంటూ తద్వారా పెద్దిరెడ్డి కుట్రలు కుతంత్రాలను సత్యవేడులోని ప్రజలు టిడిపి జనసేన బిజెపి పార్టీ శ్రేణులు తిప్పికొట్టారంటూ ఎమ్మెల్యే అన్నారు.

ఎమ్మెల్యే అంటే దోచుకోవడం దాచుకోవడం ఇసుక గ్రావెల్ మట్టి అక్రమ దందాలు చేయడం కాదంటూ ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి అనుచరుల నాయకులు అంటూ సత్యవేడులో దందాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం వారికి ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించడం మండలాల్లో తరచూ పర్యటించడం మండల అభివృద్ధి కార్యక్రమాల పనులు చేయడమే  ఎమ్మెల్యే బాధ్యత అంటూ ఆయన అన్నారు.

మంచి పెద్దిరెడ్డి సత్యవేడు అభివృద్ధి చేస్తానం టూ అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేసి ప్రారంభించి ఆ పనులు చేయకపోవడం ఎంతవరకు సమంజసంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మండిపడ్డారు అందువల్లే సత్యవేడు లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి వలనే జరిగిందంటూ ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి ప్రముఖ నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ లు ఐ టి డి పి పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments