ప్రముఖ నటి కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. స్నేహితుడు ఆంటోనీతో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఈ నెల 12న వీరి వివాహం జరగనుంది. వెడ్డింగ్ కార్డు ఫొటో కాస్తా బయటకురాగా నెట్టింట వైరల్‌గా మారింది.
‘‘ఆంటోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలలో వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కీర్తితో ఆయనకు పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారింది’’ అని కోలీవుడ్ వర్గాల సమాచారం. కీర్తి సురేశ్ తాను ప్రేమించిన వాడిని పెళ్లిచేసుకోబోతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. వాటిని నిజం చేస్తూ కొన్ని రోజుల క్రితమే ఆమె అధికారికంగా ప్రకటించారు. 15 ఏళ్లుగా తమ బంధం కొనసాగుతోందన్నారు. మరోవైపు, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేశ్ అనంతరం మీడియా వేదికగానూ ఆ విషయాన్ని చెప్పారు. తాము గోవాలో వివాహం చేసుకోబోతున్నట్టు తెలిపారు.
0 Comments