Hot Widget

recent/hot-posts

Read more

Show more
*మీడియా పై మోహన్ బాబు దాడిని ఖండిస్తున్నాం* *డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU)*సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా పై చేసిన దాడిని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU) రాష్ట్ర కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం.మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్ట్ లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి.మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ దాడి చేయడం సరికాదు. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU )*కే రాజేంద్ర ప్రసాద్**రాష్ట్ర అధ్యక్షులు**బొడ్డు అశోక్* *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*88979 61644
*ఇక నుండి మీ మొబైల్ లోనే మీ సేవ డిజిటల్ సేవలు* హైదరాబాద్:డిసెంబర్ 09తెలంగాణ ప్రజలకు పౌర సేవలు మరింత దగ్గర కానున్నాయి వినూత్న నిర్ణయాలు, పథకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపో  తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో తాజాగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఇందులో భాగంగానే తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువచేసే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం సరికొత్త మొబైల్ యాప్ ను ఆవిష్కరించనుంది. మీసేవ మొబైల్ యాప్ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొ చ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మీసేవ మొబైల్ యాప్ ను ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ తో.. ప్రజలకు ఇంటి వద్ద నుంచే పౌర సేవలు పొందే అవకాశం కల్పించారు. ఈ యాప్ సహాయంతో ఇంటి నుంచే 150 రకాల పౌరసేవలను పొందే అవకాశం కల్పించారు. రద్దీగా ఉండే ప్రాంతాలైన మెట్రో స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్, సమీకృత కలెక్టరేట్లు తదితర ప్రాంతాల్లో ఇంటరాక్టివ్‌ కియోస్క్‌ ద్వారా ప్రజలు పౌరసేవలు అందిస్తారు. ఇదిలా ఉంటే మీసేవలో ప్రభుత్వం కొత్త సర్వీసు లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టూరిజం హోటల్స్, ప్యాకేజీల బుకింగ్, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, వృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ, సదరం సర్టిఫికెట్ల జారీ, వీటితోపాటు..పర్మిట్ల రెన్యూవల్, కొత్తవి జారీ చేయటం, వాల్టా చట్టం కింద చెట్ల తొల గింపు, తరలించేందుకు అనుమతులు వంటి సేవలన్నీ స్మార్ట్ ఫోన్ లోనే పొందొచ్చు. దీంతో ప్రజలు ఇకపై పనుల గురించి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండద
*రాయచోటి పట్టణంలో హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలి**రాయచోటి పట్టణం ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి**రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి**పట్టణంలో గొడవలు జరిగితే కఠిన చర్యలు* *జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు**రాయచోటి, డిసెంబర్ 7:-*రాయచోటి పట్టణంలో హిందూ ముస్లింలు సోదర భావంతో మెలిగి ఎటువంటి గొడవలకు చోటు ఇవ్వరాదని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ...రాయచోటి  పట్టణంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న గొడవలను దృష్టిలో ఉంచుకొని హిందూ ముస్లిం సోదరులతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో హిందూ ముస్లింలు ఒకరికొకరు సోదర భావంతో మెలగాలని ఎటువంటి కండిషన్లు లేకుండా నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. ప్రస్తుత సమాజ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజులలో ఎవరికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా అధికార యంత్రాంగం తరపున గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఇందుకు సంబంధించి నాలుగైదు రోజుల తర్వాత రెండు వర్గాల మత పెద్దలను పిలిపించి మరొక పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ పీస్ కమిటీ సమావేశంలో ఇకనుంచి పట్టణంలో ఎటువంటి గొడవలకు తాగు లేకుండా శాశ్విత పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు.జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.... రాయచోటి పట్టణంలో ఎటువంటి గొడవలు జరిగిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పట్టణంలో కొంతమంది ఆకతాయిలు గొడవలు సృష్టిస్తున్నారని అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గత మూడు రోజుల నుంచి జరుగుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాత్రి 10:30 గంటల తర్వాత అత్యవసర పరిస్థితులలో తప్ప  అనవసరంగా ఎవరు బయట తిరగకూడదన్నారు. రాయచోటి పట్టణం  ప్రశాంత వాతావరణంలో ఉండేందుకు సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టడం జరిగిందన్నారు. పట్టణంలో ఎటువంటి చిన్న సమస్యలు కూడా తలెత్తకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్డీవో శ్రీనివాస్, తహసిల్దార్ పుల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వాసు బాబు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ నటి కీర్తి సురేశ్‌  త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. స్నేహితుడు ఆంటోనీతో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఈ నెల 12న వీరి వివాహం జరగనుంది. వెడ్డింగ్‌ కార్డు ఫొటో కాస్తా బయటకురాగా నెట్టింట వైరల్‌గా మారింది.‘‘ఆంటోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలలో వ్యాపారాలున్నాయి. స్కూల్‌ డేస్‌ నుంచి కీర్తితో ఆయనకు పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారింది’’ అని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. కీర్తి సురేశ్‌ తాను ప్రేమించిన వాడిని పెళ్లిచేసుకోబోతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. వాటిని నిజం చేస్తూ కొన్ని రోజుల క్రితమే ఆమె అధికారికంగా ప్రకటించారు. 15 ఏళ్లుగా తమ బంధం కొనసాగుతోందన్నారు. మరోవైపు, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేశ్‌ అనంతరం మీడియా వేదికగానూ ఆ విషయాన్ని చెప్పారు. తాము గోవాలో వివాహం చేసుకోబోతున్నట్టు తెలిపారు. 
శ్రీశైలం స్థానికులకు మాత్రం ఆ భూకైలాస మల్లన్న స్పర్శ దర్శనం మాత్రం చాలా కష్టం?
బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులు మన జీవితాలని ఎన్ని రకాలుగా ప్రభావితం చేయగలవు అర్థం కావడం లేదు.
*కోల్‌కతా డాక్టర్ ఫోటోలు, వీడియోలే కాదు పేరును వాడొద్దు..: సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ వార్నింగ్*కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆండ్ హాస్పిటల్ వైద్యురాలి హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆమె పేరుతో పాటు ఫోటోలు, వీడియోలతో వార్తలు ప్రసారంచేయడం, సోషల్ మీడియాలో పెట్టడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బాధితురాలికి సంబంధించిన వివరాలను, ఫోటోలు, వీడియోల ప్రసారాన్ని నిలిపివేయాలని మీడియా సంస్థలను... సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యురాలి హత్యాచారం ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇవాళ(మంగళవారం) చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జెబి పర్దివాల, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే బాధితురాలి వివరాలు, ఫోటోలు,వీడియోలను ప్రసారం చేయడంపై లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో వెంటనే బాధితురాలి వివరాలను, ఫోటోలు, వీడియోలను తొలగించాలని న్యాయమూర్తులు ఆదేశించారు.