*శ్రీశైలం ఘ‌ట‌న‌పై నేష‌న‌ల్ హ్యూమ‌న్ రైట్స్‌కు ఫిర్యాదు**దీక్ష పూర్తిచేసి ఇరుముడితో శివ‌య్య ద‌ర్శ‌నానికి వ‌చ్చిన స్వాముల‌పై లాఠీచార్జ్‌**భ‌క్తుల‌పై పోలీసుల లాఠీచార్జ్ చేయ‌డంపై  NHRCకి ఫిర్యాదు చేసిన సీనియర్ న్యాయవాది**పోలీసులు, ఆలయ పాలక మండలిపై ఫిర్యాదు చేసిన నంద్యాల సీనియర్ న్యాయవాది ఫణీంద్ర నాథ్*
*మీడియా పై మోహన్ బాబు దాడిని ఖండిస్తున్నాం* *డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU)*సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా పై చేసిన దాడిని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU) రాష్ట్ర కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం.మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్ట్ లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి.మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ దాడి చేయడం సరికాదు. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU )*కే రాజేంద్ర ప్రసాద్**రాష్ట్ర అధ్యక్షులు**బొడ్డు అశోక్* *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*88979 61644
*ఇక నుండి మీ మొబైల్ లోనే మీ సేవ డిజిటల్ సేవలు* హైదరాబాద్:డిసెంబర్ 09తెలంగాణ ప్రజలకు పౌర సేవలు మరింత దగ్గర కానున్నాయి వినూత్న నిర్ణయాలు, పథకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపో  తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో తాజాగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఇందులో భాగంగానే తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువచేసే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం సరికొత్త మొబైల్ యాప్ ను ఆవిష్కరించనుంది. మీసేవ మొబైల్ యాప్ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొ చ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మీసేవ మొబైల్ యాప్ ను ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ తో.. ప్రజలకు ఇంటి వద్ద నుంచే పౌర సేవలు పొందే అవకాశం కల్పించారు. ఈ యాప్ సహాయంతో ఇంటి నుంచే 150 రకాల పౌరసేవలను పొందే అవకాశం కల్పించారు. రద్దీగా ఉండే ప్రాంతాలైన మెట్రో స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్, సమీకృత కలెక్టరేట్లు తదితర ప్రాంతాల్లో ఇంటరాక్టివ్‌ కియోస్క్‌ ద్వారా ప్రజలు పౌరసేవలు అందిస్తారు. ఇదిలా ఉంటే మీసేవలో ప్రభుత్వం కొత్త సర్వీసు లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టూరిజం హోటల్స్, ప్యాకేజీల బుకింగ్, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, వృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ, సదరం సర్టిఫికెట్ల జారీ, వీటితోపాటు..పర్మిట్ల రెన్యూవల్, కొత్తవి జారీ చేయటం, వాల్టా చట్టం కింద చెట్ల తొల గింపు, తరలించేందుకు అనుమతులు వంటి సేవలన్నీ స్మార్ట్ ఫోన్ లోనే పొందొచ్చు. దీంతో ప్రజలు ఇకపై పనుల గురించి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండద
*రాయచోటి పట్టణంలో హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలి**రాయచోటి పట్టణం ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి**రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి**పట్టణంలో గొడవలు జరిగితే కఠిన చర్యలు* *జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు**రాయచోటి, డిసెంబర్ 7:-*రాయచోటి పట్టణంలో హిందూ ముస్లింలు సోదర భావంతో మెలిగి ఎటువంటి గొడవలకు చోటు ఇవ్వరాదని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ...రాయచోటి  పట్టణంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న గొడవలను దృష్టిలో ఉంచుకొని హిందూ ముస్లిం సోదరులతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో హిందూ ముస్లింలు ఒకరికొకరు సోదర భావంతో మెలగాలని ఎటువంటి కండిషన్లు లేకుండా నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. ప్రస్తుత సమాజ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజులలో ఎవరికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా అధికార యంత్రాంగం తరపున గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఇందుకు సంబంధించి నాలుగైదు రోజుల తర్వాత రెండు వర్గాల మత పెద్దలను పిలిపించి మరొక పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ పీస్ కమిటీ సమావేశంలో ఇకనుంచి పట్టణంలో ఎటువంటి గొడవలకు తాగు లేకుండా శాశ్విత పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు.జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.... రాయచోటి పట్టణంలో ఎటువంటి గొడవలు జరిగిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పట్టణంలో కొంతమంది ఆకతాయిలు గొడవలు సృష్టిస్తున్నారని అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గత మూడు రోజుల నుంచి జరుగుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాత్రి 10:30 గంటల తర్వాత అత్యవసర పరిస్థితులలో తప్ప  అనవసరంగా ఎవరు బయట తిరగకూడదన్నారు. రాయచోటి పట్టణం  ప్రశాంత వాతావరణంలో ఉండేందుకు సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టడం జరిగిందన్నారు. పట్టణంలో ఎటువంటి చిన్న సమస్యలు కూడా తలెత్తకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్డీవో శ్రీనివాస్, తహసిల్దార్ పుల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వాసు బాబు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ నటి కీర్తి సురేశ్‌  త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. స్నేహితుడు ఆంటోనీతో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఈ నెల 12న వీరి వివాహం జరగనుంది. వెడ్డింగ్‌ కార్డు ఫొటో కాస్తా బయటకురాగా నెట్టింట వైరల్‌గా మారింది.‘‘ఆంటోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలలో వ్యాపారాలున్నాయి. స్కూల్‌ డేస్‌ నుంచి కీర్తితో ఆయనకు పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారింది’’ అని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. కీర్తి సురేశ్‌ తాను ప్రేమించిన వాడిని పెళ్లిచేసుకోబోతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. వాటిని నిజం చేస్తూ కొన్ని రోజుల క్రితమే ఆమె అధికారికంగా ప్రకటించారు. 15 ఏళ్లుగా తమ బంధం కొనసాగుతోందన్నారు. మరోవైపు, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేశ్‌ అనంతరం మీడియా వేదికగానూ ఆ విషయాన్ని చెప్పారు. తాము గోవాలో వివాహం చేసుకోబోతున్నట్టు తెలిపారు. 
శ్రీశైలం స్థానికులకు మాత్రం ఆ భూకైలాస మల్లన్న స్పర్శ దర్శనం మాత్రం చాలా కష్టం?
బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులు మన జీవితాలని ఎన్ని రకాలుగా ప్రభావితం చేయగలవు అర్థం కావడం లేదు.
*కోల్‌కతా డాక్టర్ ఫోటోలు, వీడియోలే కాదు పేరును వాడొద్దు..: సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ వార్నింగ్*కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆండ్ హాస్పిటల్ వైద్యురాలి హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆమె పేరుతో పాటు ఫోటోలు, వీడియోలతో వార్తలు ప్రసారంచేయడం, సోషల్ మీడియాలో పెట్టడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బాధితురాలికి సంబంధించిన వివరాలను, ఫోటోలు, వీడియోల ప్రసారాన్ని నిలిపివేయాలని మీడియా సంస్థలను... సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యురాలి హత్యాచారం ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇవాళ(మంగళవారం) చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జెబి పర్దివాల, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే బాధితురాలి వివరాలు, ఫోటోలు,వీడియోలను ప్రసారం చేయడంపై లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో వెంటనే బాధితురాలి వివరాలను, ఫోటోలు, వీడియోలను తొలగించాలని న్యాయమూర్తులు ఆదేశించారు.
 రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీదత్‌ను నియమించింది. ఆయనకు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌గా ఎం.వి.శేషగిరి, హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌శాఖ కమిషనర్‌గా రేఖారాణి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌ నియమితులయ్యారు.రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లుమైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సి.హెచ్‌.శ్రీదత్‌సి.హెచ్‌.శ్రీదత్‌కు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలుస్టాంపులు, రిజిస్ట్రేషన్‌లు ఐజీ, కమిషనర్‌గా ఎం.వి.శేషగిరిహ్యాండ్లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌ కమిషనర్‌గా రేఖా రాణిప్రజారోగ్యం, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ఎండీగాను హరికిరణ్‌కు అదనపు బాధ్యతలుసెర్ప్‌ సీఈవోగా వీరపాండ్యన్‌మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఎం.హరినారాయణబీసీ సంక్షేమ డైరెక్టర్‌గా మల్లికార్జునబీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా మల్లికార్జునకు అదనపు బాధ్యతలుసాంఘిక, సంక్షేమ శాఖ కార్యదర్శిగాను ప్రసన్నవెంకటేష్‌భూ సర్వే, సెటిల్‌మెంట్‌ల డైరెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావుసివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఎండీగా గిరిశ్ షాఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీగా మంజీర్‌ జిలానీమంజీర్‌ జిలానీకి శాప్‌ ఎండీగా అదనపు బాధ్యతలుఇంటర్మీడియర్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా కృతికా శుక్లాబోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గాను కృతికా శుక్లాకు అదనపు బాధ్యతలుఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీగా రవిసుభాష్‌ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా లక్ష్మీ షాఎన్టీఆర్‌ వైద్య సేవ సీఈవోగాను లక్ష్మీ షాకు అదనపు బాధ్యతలుమహిళాభివృద్ధి, శిశు సంక్షేమ డైరెక్టర్‌గా ఎం.వేణుగోపాల్‌రెడ్డిఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ పి.రాజబాబుఎక్సైజ్‌ శాఖ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌గా నిషాంత్‌కుమార్‌క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్‌ మిషన్‌ ఎండీగా జి.సి. కిషోర్‌కుమార్‌అగ్రికల్చర్‌ మార్కెట్‌ శాఖ డైరెక్టర్‌గా విజయసునీతఉద్యానశాఖ డైరెక్టర్‌గా కె.శ్రీనివాసులుసాంఘిక, సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా లావణ్య వేణిఏపీఐఐసీ ఎండీగా అభిషిక్త్‌ కిషోర్‌ఏపీటీడీసీ ఎండీగానూ అభిషిక్త్‌ కిషోర్‌కు అదనపు బాధ్యతలుసెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌గా ఏ.సిరిఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌గా రామసుందర్‌రెడ్డికాడా కమిషనర్‌గా రామసుందర్‌రెడ్డిఏపీ ట్రాన్స్‌కో జాయింట్‌ ఎండీగా కీర్తి చేకూరిస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా గణేష్‌కుమార్‌టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా గణేష్‌కుమార్‌పురపాలక శాఖ సంపత్‌కుమార్‌
నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చుమర్రి గ్రామంలో మైనర్ బాలిక పై అత్యాచారం మరియు హత్య కేసు విచారణలో భాగంగా రాబడిన సమాచారం మేరకు ముద్దాయి అయిన హుస్సేన్ ను నంద్యాల టౌన్ శివారులో మసీదుపురం మెట్ట వద్ద అదుపులోకి తీసుకొనీ నందికొట్కూరు కి తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యలో మిడ్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తలముడిపి బాట వద్ద ముద్దాయి హుస్సేన్ పోలీస్ జీప్ లో నుండి దూకి  పారిపోతుండగా, అతనిని పోలీసులు పట్టుకొనగా,  ఆయాసం తో ఎద నొప్పిగా  ఉందని చెప్పగా, వెంటనే పోలీసులు ముద్దాయి హుస్సేన్ ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి మార్గమధ్యమంలో లో చనిపోయాడని నిర్ధారించడం జరిగింది. పై విషయానికి సంబంధించి మిడుతూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.కర్నూలు జిల్లాకు చెందిన డి.ఎస్.పి స్థాయి అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు శవపంచనామా నిర్వహించడం జరిగింది.చనిపోయిన వ్యక్తి గత కొంతకాలం నుండి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు శవ పంచనామా సమయంలో బందువులు మేజిస్ట్రేట్ ముందు చెప్పడం జరిగింది. కేసు నిష్పక్షపాత దర్యాప్తులో భాగంగా, డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం పూర్తి చేయించడం జరిగింది.మొత్తం పోస్టుమార్టం ప్రాసెస్ ను వీడియోగ్రఫీ చేయడం జరిగింది.చట్ట ప్రకారం అన్ని నియమ నిబంధనలు పాటించి కేసు ను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నాము. జిల్లా పోలీసు కార్యాలయం,నంద్యాల.
*పోలీస్....సస్పెండ్* సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురెందర్ రెడ్డి సస్పెండ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సిపి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన మహిళ పట్ల అసభ్య చాటింగ్ సైబరబాద్ సిపిను ఆశ్రయించిన బాధితురాలు సిఐ చేసిన చాటింగ్ సీపికి చూపించిన బాధితురాలు అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్ కి రావాలి అంటూ సిఐ మేసేజిలు
పగిడ్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మైనర్‌ బాలిక అదృశ్యం కేసులో ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా తెలిపారు. ఈనెల 7న అదృశ్యమైన బాలికను ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు మాయమాటలు చెప్పి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సమీపాన ఉన్న ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అనంతరం గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపినట్లు నిందితులు అంగీకరించారు. అక్కడి నుంచి శవాన్ని తీసుకొచ్చి కేసీ కెనాల్‌ వద్ద దాచారు.ఈ విషయాన్ని బాలురు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అదే రోజు రాత్రి శవాన్ని అక్కడి నుంచి వనములపాడు మీదుగా కృష్ణానదిలో పుట్టిలో తీసుకెళ్లి తాడుతో రాయికి కట్టి నీటిలో పడేశారు. ఇదే విషయాన్ని బాలుడి తండ్రి, పెదనాన్న చెప్పడంతో ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. బాలిక మృతదేహం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. గజ ఈత గాళ్లు, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు, 6 స్పెషల్ పార్టీ బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, టెక్నికల్ టీమ్‌లను రంగంలోకి దింపి గాలింపు చేపట్టామని వివరించారు.
పగిడ్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మైనర్‌ బాలిక అదృశ్యం కేసులో ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా తెలిపారు. ఈనెల 7న అదృశ్యమైన బాలికను ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు మాయమాటలు చెప్పి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సమీపాన ఉన్న ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అనంతరం గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపినట్లు నిందితులు అంగీకరించారు. అక్కడి నుంచి శవాన్ని తీసుకొచ్చి కేసీ కెనాల్‌ వద్ద దాచారు.ఈ విషయాన్ని బాలురు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అదే రోజు రాత్రి శవాన్ని అక్కడి నుంచి వనములపాడు మీదుగా కృష్ణానదిలో పుట్టిలో తీసుకెళ్లి తాడుతో రాయికి కట్టి నీటిలో పడేశారు. ఇదే విషయాన్ని బాలుడి తండ్రి, పెదనాన్న చెప్పడంతో ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. బాలిక మృతదేహం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. గజ ఈత గాళ్లు, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు, 6 స్పెషల్ పార్టీ బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, టెక్నికల్ టీమ్‌లను రంగంలోకి దింపి గాలింపు చేపట్టామని వివరించారు.
*అమరావతి**పెట్టుబడులు పెట్టేందుకు క్లబ్ మహీంద్రా సిద్ధం**సీఎం చంద్రబాబుతో సమావేశమైన క్లబ్ మహీంద్రా ఛైర్మన్‌ గుర్నాని‌*రాష్ట్రంలో ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు క్లబ్ మహీంద్రా' సంస్థ ఆసక్తి చూపడం సంతోషాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సంస్థ చైర్మన్ సీపీ గుర్నానీ, ఆయన బృందంతో భేటీ అయినట్లు బుధవారం 'ఎక్స్'లో పేర్కొన్నారు. భేటీ ఫొటోల్ని పోస్టు చేశారు. క్లబ్ మహీంద్రా సంస్థ దేశ, విదేశాల్లో ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఈ సంస్థకు 140కి పైగా రిసార్టులు ఉన్నాయి.
*నేడు 4/7/2024: స్వామి వివేకానంద 122 వ వర్ధంతి:**భారతదేశాన్ని ప్రేమించడమెలాగో, ఉద్ధరించడమెలాగో నేర్పిన మహనీయుడు స్వామి వివేకానంద!**‘‘ఓ తేజస్వరూపా! జననమరణాలకు అతీతుడా! మేలుకో.బలహీనతల్ని తొలగించుకో!పౌరుషాన్ని ప్రసాదించుకో!మనిషిగా మసలుకో. లే!లెమ్ము’’ అంటూ యువతను జాగృతం చేసిన వేదాంతభేరి స్వామి వివేకానంద.స్వామి వివేకానంద ఇలా యువతను జాగృతం చేసారు.**ప్రేమ... డబ్బు..ఙ్ఞానం.. చదువు..దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల,సంకల్పబలం, శ్రమించే తత్వం.**గొప్ప అవకాశాలే వస్తే ఏమి చేతకాని వారు కూడా ఏదో గొప్ప సాదించవచ్చు.ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాదించినవాడే గొప్పవాడు.**ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాదించిన గొప్ప వ్యక్తుల జీవతాలను  నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడు అనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడు అనేది నేటి మా
*పింఛన్లు పంపిణీ చేస్తూ మధ్యలో ఇంటికి, కాసేపటికే బాత్రూంలో శవమై కనిపించిన సచివాలయ ఉద్యోగిని..!!*నంద్యాల  జిల్లా :నూనెపల్లెకు చెందిన సుధారాణి (32) నంద్యాల తలారి పేటలో 29వ వార్డు సచివాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తుంది..సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పింఛన్లు పంపిణీ చేసిన ఆమె.. అనంతరం మధ్యలో ఇంటికి వెళ్లింది..అయితే ఎంతకు ఆమె బయటకు రాకపోవడంతో తోటి ఉద్యోగులు ఫోన్‌ చేశారు..అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు..ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సుధారాణి ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఆమె తన పుట్టింట్లో ఉన్నట్లు తెలిసింది..వెంటనే అక్కడకు వెళ్లి చూడగా,ఇంట్లోని స్నానాల గదిలో అనుమానాస్పద స్థితిలో సుధారాణి మృత దేహం కనిపించింది..పోలీసులు ఆమె మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు..మృతురాలి భర్త, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నంద్యాల మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు..సుధారాణికి ఏడాది క్రితమే వివాహం జరిగినట్లు తెలుస్తోంది..మృతురాలి భర్త కూడా సచివాలయ ఉద్యోగే కావడం గమనార్హం.. ఘటనపై పూర్తి విచారణ అనంతరం అసలు కారణం తెలుస్తుందని పోలీసులు మీడియాకు తెలిపారు..
*నైపుణ్యాభివృద్ధితో యువతకు ఉపాధి కల్పనకు పెద్దపీట**పకడ్బందీగా స్కిల్ సెన్సెస్ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు**స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష*అమరావతిః రాష్ట్రంలో  విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్కిల్ సెన్సెస్ లో వివిధ శాఖలను భాగస్వామ్యం చేయడానికి విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా ఏపీఎస్ఎస్ డీసీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యాన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించడానికి గల అవకాశాలపై చర్చించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసి, మెరుగైన విధానాలతో తదుపరి ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ఇందుకోసం అధికారులు ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విధానాలను పరిశీలించాలని సూచించారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. ఈ సమీక్షలో స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ సౌరభ్ గౌర్, ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ రాజబాబు, డీఈటీ నవ్య, సీఈవో సీడ్ యాప్ శ్రీనివాసులు, ఏడీజీ న్యాక్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.******
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని  మర్యాదపూర్వకంగా కలిసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్.
తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ- తుడా ఛైర్మన్‌ గా జనసేనా పార్టీ నాయకురాలు శ్రీమతి చైతన్య పేరు దాదాపు ఖరారైంది. జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌గా, పార్టీ బలోపేతంతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపునకు విశేషంగా కృషి చేసినందుకు గానూ జనసేనా పార్టీ అధినేత శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారి ఆశీర్వాదంతో శ్రీమతి చైతన్య పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి తుడా ఛైర్మన్‌ పదవి కోసం పలువురు టీడీపీ నాయకులు పోటీలో ఉన్నారు. కానీ చిత్తూరు జిల్లాలోని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని స్వయానా శ్రీ ఆదికేశవులు నాయుడు గారి మనుమరాలైన శ్రీమతి చైతన్య వైపు జనసేన పార్టీతో పాటు కూటమి అగ్రనాయకులు మొగ్గుచూపుతున్నారు. శ్రీమతి చైతన్య గారి అభ్యర్థిత్వాన్ని జనసేనా, టీడీపీ, బీజేపీ పూర్తిగా బలపరుస్తున్న కారణంగా రెండు, మూడు రోజుల్లో శ్రీమతి చైతన్య పేరును తుడా ఛైర్మన్‌గా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు శాసనసభకు, చిత్తూరు పార్లమెంట్‌ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశాలున్నా… అధినాయకత్వం ఎంపికల్ని కాదనకుండా ఆయా చోట్ల నిలిపిన కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి నాయకులు శ్రీమతి చైతన్య అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నారు. పైగా ఈమె అదికేశవుల నాయుడు గారి కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకురాలు కావడంతో… ఈ పదవిని చైతన్యకు ఇవ్వడం ద్వారా వారి కుటుంబానికి సరైన గౌరవం కల్పించినట్లవుతుందని, ఆ ప్రాంతంలోని సామాజిక సమీకరణాల్ని సైతం తృప్తి పరిచినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ భావిస్తున్నారు.
నిష్పాక్ష పాత్ర జర్నలిజం విలువలను తెలియజేసిన రామోజీరావు.